Surprise Me!

Criminal lost life after consuming Poison during hearing | Oneindia Telugu

2017-12-01 524 Dailymotion

The defense lawyer for a Bosnian Croat crimes suspect said her client "had taken poison" during the reading of his verdict on Wednesday at Hague. <br /> <br />కోర్టు హాలులో ఒకపక్క వాదనలు జరుగుతుండగానే... విషం తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బుధవారం ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... బోస్నియాకు చెందిన వార్ కమాండర్ జనరల్ స్లోబోడన్ ప్రల్జాక్‌ను యుద్ధనేరస్థుడిగా పరిగణిస్తూ 20 ఏళ్ల జీవితఖైదు విధించింది న్యాయస్థానం. ఈ తీర్పును సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నాడు స్లోబోడన్. <br />దీనిపై బుధవారం వాదనలు జరుగుతుండగా, ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తుండటంతో.. కోర్టు హాలులోనే టీవీ కెమేరాల సాక్షిగా స్లోబోడన్ విషం తాగేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన జడ్జి.. వాదనలు నిలిపివేశారు. అతడికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డాక్టర్ అక్కడికి చేరుకునేలోపే స్లోబోడన్ మృతి చెందినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కోర్టు హాలులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని అక్కడి అధికారులు చెబుతున్నారు. <br />

Buy Now on CodeCanyon